కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!
- September 29, 2025
దుబాయ్: దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన కోల్‌కతా ఫెస్టివల్ థీమ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం కోల్‌కతా దుర్గా పూజ నిర్వాహకులు ఇలాంటి థీమ్ లతో తమ దుర్గా మాతా మండపాలను నిర్మిస్తుంటారు. కోల్‌కతాలోని ఒక పండల్ నిర్వాహకులు ఎమిరేట్ లోని బుర్జ్ ఖలీఫాపై ఇలాంటి థీమ్ ను పునఃసృష్టించడానికి ప్రయత్నించింది.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని IB బ్లాక్ దుబాయ్ అనుభూతిని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ అల్ అరబ్ మరియు బుర్జ్ ఖలీఫా ప్రతిరూపాలు ఈ సంవత్సరం కోల్‌కతాలో ఎక్కువగా వైరలవుతున్న పండళ్లలో నిలిచాయి. ఇప్పటికే IB బ్లాక్ పండల్ కు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
దుబాయ్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని, ఇక్కడి నుంచి భారతీయ సంస్కృతులను ఈ థీమ్ ద్వారా, దుర్గా పూజ స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామని ఐబి బ్లాక్ దుర్గా పూజ నిర్వాహక కమిటీ సభ్యులు రాయ్పూర్ణ హల్దర్ అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







