8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- September 29, 2025
మనామా: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నేతృత్వంలో మనామా సూక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ ప్రవేశ ద్వారం నుండి ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఇన్స్టాలేషన్ “అల్-ముర్తషా” తొలగించారు.
2017 నుండి సౌక్ ప్రధాన ద్వారం పైకప్పును అలంకరించిన ఈ ఆర్ట్ వర్క్.. ఈ ప్రాంతంలో అత్యంత విలక్షణమైన ఆర్ట్ వర్క్ గా ప్రసిద్ధి పొందింది. దీనిని కాయిన్స్ ఆకారంలో ఉన్న 20వేల కంటే ఎక్కువ బంగారు పూతతో కూడిన మెటల్ గొలుసులతో రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ను 2017లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తొలిసారిగా ప్రారంభించింది. అప్పటినుండి ఇది మనామా సూక్ సందర్శకులకు స్వాగత ద్వారంగా మారింది. ఇప్పుడు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దీనిని తొలగించినట్లు, త్వరలోనే దీని స్థానలంలో మరో అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్న ఆర్ట్ వర్క్ పీస్ ను ఇన్ స్టాల్ చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్‌లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు