హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు
- September 30, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఇప్పటివరకు సీపీగా(CP) ఉన్న సీవీ ఆనంద్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
సజ్జనార్ గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తిరిగి పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బదిలీల్లో భాగంగా సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా నియమించారు.
ఇంతకాలం నగర కమిషనర్‌గా సేవలందించిన సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన తన బాధ్యతలను సజ్జనార్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







