ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్‌షిప్‌..!!

- September 30, 2025 , by Maagulf
ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్‌షిప్‌..!!

దోహా: 2025 షెల్ ఎకో-మారథాన్ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ పోటీలు విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో 2026లో మరోసారి ఖతార్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తామని, ఆ తర్వాత 2027లో మొట్టమొదటి షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తామని షెల్ ప్రకటించింది.

లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో 2025 ఎడిషన్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ 40 ఏళ్ల చరిత్రలో ఈ ఈవెంట్‌ను మధ్యప్రాచ్యంలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు.  ఈ పోటీలో 12 దేశాల నుండి 60 కి పైగా విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు ఎనర్టీ ఎఫిషియెంట్ వాహనల రూపకల్పనలో అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించారని షెల్ కంపెనీస్ ఖతార్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్‌పర్సన్ రాబ్ మాక్స్‌ వెల్ వెల్లడించారు. 2027 షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్‌షిప్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచే జట్లను ఒకచోటకు చేర్చుతుందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com