హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్గా బహ్రెయిన్..!!
- September 30, 2025
మనామా: హ్యుమన్ ట్రాఫికింగ్ ను ఎదుర్కోవడంలో మరియు మానవ హక్కులను కాపాడడంలో అంతర్జాతీయ మోడల్ గా బహ్రెయిన్ నిలిచిందని , వరుసగా ఎనిమిదవ సంవత్సరం కూడా బహ్రెయిన్ తన టైర్ 1 వర్గీకరణను కొనసాగించింది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మార్గదర్శకత్వంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో బహ్రెయిన్ ప్రపంచ దేశాలకు మోడల్ గా నిలుస్తుందని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు హ్యుమన్ ట్రాఫికింగ్ జాతీయ కమిటీ చైర్మన్ నిబ్రాస్ మొహమ్మద్ అలీ తలేబ్ తెలిపారు.
బహ్రెయిన్ లో అమలవుతున్న చట్టాలు కఠినంగా ఉంటాయని, మానవ అక్రమ రవాణా నిరోధక వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. 188 దేశాలు ఉన్న జాబితాలో టైర్ 1 హోదాను సాధించడం బహ్రెయిన్ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. మానవ హక్కుల రక్షణలో రోల్ మోడల్గా బహ్రెయిన్ అంతర్జాతీయ ఖ్యాతిని కొనసాగించడం కోసం కృషి చేస్తామన్నారు. మానవ హక్కులలో బహ్రెయిన్ విజయాలకు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో యునైటెడ్ స్టేట్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మరియు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్తో మెరుగైన సహకారం కూడా తమకు ఉపయోగపడిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







