ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!

- October 01, 2025 , by Maagulf
ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!

మస్కట్: ఇబ్రిలోని విలాయత్‌లోని తనమ్ ప్రాంతంలో వాతావరణంలో ఘాటైన వాసనలు వస్తున్నాయన్న నివేదికలపై పర్యావరణ అథారిటీ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. అధునాతన సాంకేతికతలు , అధిక ఖచ్చితత్వ సాధనాలతో గాలి నాణ్యతను కొలిచామని, అందులో అసాధారణ లేదా అసహజ కాలుష్య కారకాలను గుర్తించలేదని తెలిపింది. కాగా, అధికారులు ఆ ప్రాంతంలో పర్యవేక్షణను కొనసాగిస్తున్నారని వెల్లడించింది. ప్రజలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను నమ్మొద్దని, వాస్తవ సమాచారాన్ని అధికారుల నుంచి పొందాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com