రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!

- October 01, 2025 , by Maagulf
రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!

రియాద్: లైసెన్స్ లేకుండా ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్న ఓ డాక్టర్ ను అధికారులు అరెస్టు చేశారు. అతను చట్టాలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పేషంట్లను ఆకర్షిస్తున్నాడని అధా తెలిపారు. పక్కా సమాచారంతో నిబంధనలకు విరుద్ధంగా హెల్త్ ప్రాక్టిస్ చేస్తున్న అరబ్ జాతీయుడిని భద్రతా అధికారుల సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్టు చేశారు.  

ఫిజియోథెరపీ, హెర్నియేటెడ్ డిస్క్‌ లకు చికిత్స వంటి వివిధ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి అరబ్ జాతీయుడు తన సొంత వాహనంలో రోగుల ఇళ్లకు వెళుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.  తదుపరి చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటువంటి ఉల్లంఘనలకు జరిమానాలుగా ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు SR100,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపింది.

లైసెన్స్ పొందిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో అర్హత కలిగిన నిపుణులచే ఆరోగ్య సంరక్షణ సేవలు పొందాలని సూచించారు. ఏదైనా ఉల్లంఘనలు లేదా అనధికార ఆరోగ్య సంరక్షణ పద్ధతులను వెంటనే 937 నంబర్ ద్వారా నివేదించాలని మంత్రిత్వశాఖ కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com