దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- October 01, 2025
దుబాయ్: దుబాయ్ లోని ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను దుబాయ్ లో ఉంటున్న తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మ వేడుకలకు హాజరు అయ్యి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ డప్పు చప్పుల్ల మధ్య బతుకమ్మ ఆటలు ఆడి గౌరమ్మకు పూజలు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మందికి పైగా తెలంగాణ ప్రవాసియులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో కోలాటాల ఆటలతో వేడుక ప్రాంగణం పులకించిపోయింది. అందులో భాగంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం స్థాపించినప్పటి నుండి వలసవచ్చిన కార్మికులకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ అన్నివిధాలుగా తోడుగా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. అందులో భాగంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుంబాల మహేందర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ మాట్లాడుతూ..."కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రామచందర్ మరియు పార్లిమెంట్ సభ్యులు సానుకూలంగా స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకరాడంలో పాటుపడుతం" అన్నారు.
ఈ కార్యక్రమానికి ఎన్. రాంచందర్ రావు (భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ) ముఖ్యఅతిథిగా విచ్చేయగా..గౌరవ అతిథులుగా డీకే అరుణ (ఎంపీ, మహబూబ్ నగర్), అర్వింద్ ధర్మపురి (ఎంపీ, నిజామాబాద్), రఘునందన్ రావు (ఎంపీ, మెదక్), సి అంజి రెడ్డి (ఎం ల్ సి ), వాసుదేవ రావు (తెలంగాణ రాష్ట్ర కోశాధ్యక్షులు), ఎన్ వి సుభాష్ (BJP అధికార ప్రతినిధి మరియు మీడియా ఇంచార్జ్), జితేందర్ వైద్య (ఐపిఫ్ - యూఏఈ అధ్యక్షులు), సురేష్ కొచ్చటిల్ (సీనియర్ జర్నలిస్ట్) మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కుంబల మహేందర్ రెడ్డి ,గారు (ఐపీఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు), వంశీ గౌడ్ రత్నగిరి(సీనియర్ ఐపిఫ్ నాయకులు), ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, రమేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ నవనీత్ గాజా, జాయింట్ సెక్రటరీ మదన్, యోగేష్, అపర్ణ, కృష్ణ మేగి, డా. సౌజన్య ముత్యాల, ట్రెసరర్ కృష్ణ నిమ్మల, మీడియా ఇన్చార్జి జగదీష్, అశోక్ పెనుకూల, సుకుమార్ మరియు ఎక్యూటివ్ సభ్యులు గోవర్ధన్ యాదవ్, అజయ్ దేశవేని, వేణు దుంపేట, పిట్ల రమేష్, వేణు, రాజు, విష్ణు తదితరులు సమక్షంలో ఈ ఏడాది బతుకమ్మ అందరిని అలరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం