కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

- October 01, 2025 , by Maagulf
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

న్యూ ఢిల్లీ: రైతులకు భరోసా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధర (MSP)లను పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం రూ.84,263 కోట్ల భారీ కేటాయింపును చేసింది. ఈ నిర్ణయం వల్ల రబీ పంటలు పండించే లక్షలాది మంది రైతులకు నేరుగా లాభం చేకూరనుంది. ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో ఉంచుకుని MSP పెంపు చేయడం వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పంట సాగు చేయడంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా పంటల ధరల పతనం నుండి రక్షణ కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ చర్య చేపట్టబడింది.

రాష్ట్రం పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.11,400 కోట్ల ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో నాఫెడ్ (NAFED)లో నమోదు చేసుకున్న రైతుల నుండి పప్పుధినుసులను వంద శాతం కొనుగోలు చేయాలని నిర్ణయించడం కీలకం. దీని వల్ల పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశముండటమే కాకుండా రైతులు సరైన ధర పొందేలా భరోసా లభిస్తుంది. అంతేకాక పప్పుధాన్యాల దిగుమతులపై ఆధారపడకుండానే దేశీయంగా అవసరాలను తీర్చుకోవచ్చు. ఇది దేశ ఆర్థికవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.

వ్యవసాయం మాత్రమే కాకుండా సాంకేతిక, వైద్య రంగాల్లోనూ ప్రగతికి దోహదం చేయడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బయోమెడికల్ రీసెర్చ్ కెరీర్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.1500 కోట్లను కేటాయించనుంది. దీని ద్వారా కొత్త తరహా పరిశోధనలు, వైద్య సాంకేతికతల అభివృద్ధి, ప్రజారోగ్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వబడుతుంది. ఈ పెట్టుబడులు దేశంలో ప్రతిభావంతులైన పరిశోధకులు, శాస్త్రవేత్తలకు కొత్త అవకాశాలు కల్పించి ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com