ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..

- October 01, 2025 , by Maagulf
ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి విద్యారంగంలో ఇది ఒక చారిత్రాత్మక పరిణామమని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఆధునిక విద్యా వనరులు, నాణ్యమైన బోధన, పరిశోధనలకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మంగళసముద్రం, బైరుగణిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతిలోని శాఖమూరులో ఈ నూతన విద్యా సంస్థలు కొలువుదీరనున్నాయి.

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన విద్యావకాశాలను అందించడంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉన్న ప్రాంతాల అవసరాలను తీర్చడంలో ఈ విశ్వవిద్యాలయాలు తోడ్పడుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com