ఫార్చ్యూన్ 500, 2016 తాజా జాబితా విడుదల...
- July 21, 2016
ఫార్చ్యూన్ 500 ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఏడు భారతీయ కంపెనీలు స్థానం సంపాదించుకున్నాయి. ఆదాయపరంగా ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడిన ఫార్చ్యూన్ 500, 2016 తాజా జాబితా విడుదలైంది. వీటిలో నాలుగు ప్రభుత్వరంగ సంస్థలు కాగా, మిగిలిన ప్రయివేటు రంగానికి చెందినవి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాబితాలో 162 ర్యాంక్ తో దేశంలో అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకోగా ప్రయివేటురంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ర్యాంక్ సాదించింది. ప్రైవేట్ వజ్రాభరణాల సంస్థ రాజేష్ ఎక్స్ పోర్ట్స్ 423 ర్యాంకింక్ తో తెరంగేట్రం చేసింది. ఓఎన్ జీసీ ఈ ఏడాది 500 కంపెనీల జాబితాలోంచి వైదొలగింది. టాటా మోటార్స్ 254 నుంచి 226కి ఎగబాకింది. ఎస్ బీఐ 260 ర్యాంక్ నుంచి 232కి తన ర్యాంక్ ను మెరుగు పర్చుకుంది. భారత్ పెట్రోలియం 280 నుంచి 358 స్థానానికి, హిందుస్థాన్ పెట్రోలియం 327 నుంచి 367 స్థానానికి పడిపోయాయి. కాగా రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ 482,130 మిలియన్ల డాలర్లతో అగ్రభాగంలో నిలిచింది. స్టేట్ గ్రిడ్ (329,601 మిలియన్ డాలర్ల ఆదాయం) రెండవ చైనా నేషనల్ పెట్రోలియం (299,271 మిలియన్ డాలర్లు) మరియు మూడవ స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 500 కంపెనీలకు చెందిన 67 మిలియన్ల మంది ఉద్యోగస్తున్నట్టు ఫార్చ్యూన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







