మన శంకరవరప్రసాద్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ప్రోమో రిలీజ్
- October 03, 2025
మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మన శంకరవ ప్రసాద్ గారు" తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు.
దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌ని స్పెషల్ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. ప్రతి పాటకీ మెగాఅన్న ప్రిఫిక్స్ జోడించి మెగా గ్రేస్, మెగా స్వాగ్, మెగా మాస్ అంటూ క్యురియాసిటీ క్రియేట్ చేశారు. ఈ ఐడియా ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకుంది.
ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతి కి వస్తున్నాం ఆల్బమ్‌తో సంచలనం సృష్టించిన మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో, ఇప్పుడు మరోసారి పండుగ సందడి క్రియేట్ చేసే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌తో రాబోతున్నారు.
ఈ ఉదయం రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోలో అనిల్ రవిపూడి స్టైల్లోని సరదా టచ్, అలాగే లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లని పరిచయం చేశారు. వీడియోలోని క్విర్కీ ప్రెజెంటేషన్ నవ్వులు పంచి మ్యూజిక్ ఫీవర్‌కి స్టేజ్ రెడీ చేసింది.
మెగా గ్రేస్ ట్రాక్ ప్రోమోగా వచ్చిన మీసాల పిల్ల ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా, ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టినట్లుగా ఉంది. నాస్టాల్జియా, మెలొడీ, యూనివర్సల్ అపీల్ని కలిపిన ఈ సాంగ్ అందరికీ నచ్చే హిట్ ట్యూన్ అవ్వడం ఖాయం.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
వ్యవహరిస్తున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి రానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
- సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!