ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- October 03, 2025
ఇబ్రా: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ తన మొదటి ఎడిషన్లో ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫోరమ్ సమావేశాలు ఇబ్రా విలాయత్లో ముగిసాయి. ఇబ్రా, అల్ ముదైబి, బిదియా మరియు సినావ్ విలాయత్ల అభివృద్ధి డిజైన్లను పరిశీలించి వాటిల్లో ఉత్తమమైన డిజైన్లను న్యాయనిర్ణేతల టీమ్ ఎంపిక చేశారు.
ఇబ్రా విలాయత్ ఎంట్రన్స్ అభివృద్ధి చేయడానికి సమర్పించిన డిజైన్ “రిఫ్లెక్షన్ ప్రాజెక్ట్” అనే డిజైన్ అవార్డు గెలుచుకుంది. అల్ ముదైబి విలాయత్ ఎంట్రన్స్ అభివృద్ధి చేయడానికి సమర్పించిన డిజైన్ “స్మార్ట్ ఒయాసిస్” ప్రాజెక్ట్, బిదియా విలాయత్ అభివృద్ధి కోసం “బిదియా విండో” అనే ప్రాజెక్ట్ డిజైన్, సినావ్లోని విలాయత్ “గ్రీన్ పాత్” ప్రాజెక్ట్ డిజైన్లు అవార్డులను గెలుచుకున్నాయి.
నార్త్ అల్ షార్కియా ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డును యువతలో సృజనాత్మకతను పెంచేందుకు, ప్రకృతి పరిరక్షణకు దృష్టిలో పెట్టుకొని విలాయత్ల ఎంట్రన్స్ లను అభివృద్ధి చేయడానికి వినూత్న నిర్మాణ నమూనాలను రూపొందించేలా ప్రోత్సహించేందుకు అందజేస్తారు.
తాజా వార్తలు
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
- సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!