క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- October 03, 2025
మనామా: అంతర్జాతీయ మోసపూరిత పథకాల ద్వారా పొందిన BD75,000 కంటే ఎక్కువ నగదును మనీ లాండరింగ్ చేసినందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఒక నిందితుడిని దోషిగా నిర్ధారించింది. న్యాయస్థానం నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD105,000 జరిమానా విధించింది. అంతేకాకుండా అతని ఆస్తుల నుండి BD75,299 జప్తు చేయాలని ఆదేశించింది.
నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నివేదిక ప్రకారం నిందితుడు వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్నాడని వెల్లడైంది. మోసపూరిత పెట్టుబడి పథకాల బాధితుల నుండి తన రెండు బ్యాంకు ఖాతాలలోకి అతను నిధులను పొందాడు. ఆపై వాటిని CoinMENA ప్లాట్‌ఫారమ్‌లోని తన ఖాతాకు క్రిప్టోకరెన్సీ (USDT) కొనుగోలు చేయడానికి బదిలీ చేశాడు. ఆ తర్వాత అతను నిధులను Binance.com లోని తన ఖాతాకు తరలించి, క్రిమినల్ నెట్వర్క్ అందించిన అనేక ఎలక్ట్రానిక్ వాలెట్లకు పంపిణీ చేసి, అందుకు బదులుగా కమిషన్ తీసుకున్నాడు. వివిధ పెట్టుబడి కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి మోసగాళ్ళు బాధితులను మోసగించారని దర్యాప్తులో తేలింది.
తాజా వార్తలు
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
- సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!