బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్

- October 03, 2025 , by Maagulf
బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్

ముంబై: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త! రేపటి నుంచి చెక్కులు అదే రోజు క్లియర్‌ అయ్యే అవకాశముంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ, HDFC ఐసీఐసీఐ వంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ‘సేమ్ డే చెక్ క్లియరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాయి.ఈ కొత్త విధానం ద్వారా ఖాతాలో జమ చేసిన చెక్కులు కేవలం కొన్ని గంటల్లోనే క్లియర్‌ అవుతాయి. చెల్లింపులు వేగవంతం అవడంతో పాటు సురక్షితంగా నిర్వహించబడతాయి. ఖాతాదారులు చెక్కులు బౌన్స్‌ కాకుండా ఉండేందుకు ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉంచడం, చెక్కుల వివరాలను సరిగ్గా నింపడం చాలా అవసరం.

చెక్కుల భద్రత కోసం ‘పాజిటివ్ పే సిస్టమ్’ అనేది తప్పనిసరి. రూ.50,000 కన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులను జమ చేయడానికి, కనీసం 24 గంటల ముందే ఖాతాదారులు బ్యాంకుకు చెక్ నంబర్, తేదీ, మొత్తం, లబ్ధిదారుడి వివరాలు పంపాలి. Banking చెక్కు సమర్పించినప్పుడు బ్యాంక్ అందించిన వివరాలతో సరిపోల్చి చూడనుంది; సరిపోని చెక్కులు తిరస్కరించబడతాయి.

మునుపటి విధానం ప్రకారం చెక్కులు క్లియర్‌ అవ్వడానికి కనీసం రెండు రోజులు పడుతున్న సందర్భాలు జరిగేవి. కొత్త విధానంతో ఈ ఆలస్యం పూర్తిగా తొలగిపోతుంది, కస్టమర్లకు మరింత సౌకర్యం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com