మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- October 04, 2025
కువైట్: కువైట్ లో మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టయింది. మానవ అక్రమ రవాణా, అక్రమ వీసా స్కామ్ లో కీలకంగా వ్యవహారించిన ఫహాహీల్లోని గృహ కార్మికుల నియామక కార్యాలయాన్ని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సీజ్ చేసుకుంది. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భద్రతా దళాలు అరెస్టు చేశాయి.
ఈ సందర్భంగా కార్యాలయంలో అక్రమంగా బంధించిన 29 మంది ఆసియా మహిళా కార్మికులను గుర్తించి విడిపించారు. ఒక్కో వీసాను KD 120 కి అమ్ముతున్నట్లు, KD 1,100–1,300 కి కాంట్రాక్టులను రీసేల్ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు. మానవ అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..