సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- October 04, 2025
రియాద్: సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ విల్లా హెగ్రా ప్రారంభమైంది. అల్ఉలాలో సౌదీ సాంస్కృతిక మంత్రి , అల్ఉలా రాయల్ కమిషన్ గవర్నర్ ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్, అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఫ్రెంచ్ సంస్కృతిక శాఖ మంత్రి రచిదా దాటితో కలిసి ప్రిన్స్ బదర్ కొత్త విల్లా హెగ్రా భవనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో రెండు దేశాల నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతుతో ప్రారంభోత్సవం సాధ్యమైందని ప్రిన్స్ బదర్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు. సౌదీ-ఫ్రెంచ్ సాంస్కృతిక భాగస్వామ్యంలో విల్లా హెగ్రా అత్యంత ముఖ్యమైనదని ఆయన అభివర్ణించారు. "అలులా విజన్" అంతర్జాతీయ సాంస్కృతిక సహకారాన్ని ప్రతిబింబిస్తుందని, సృజనాత్మకతను విస్తరిస్తుందని, సంస్కృతిని స్థిరమైన అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రిన్స్ బదర్ తెలిపారు.
ఈ సంస్థ అధికారికంగా రోమ్‌లోని విల్లా మెడిసి మరియు న్యూయార్క్ లోని విల్లా ఆల్బర్టినా వంటి చారిత్రక సంస్థలతో పాటు ఫ్రెంచ్ "వివా విల్లా" సాంస్కృతిక నెట్‌వర్క్‌లో చేరుతుందని, ఇది ప్రపంచ సాంస్కృతిక వేదికపై అల్ఉలా స్థానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







