గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!

- October 05, 2025 , by Maagulf
గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!

మస్కట్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా  గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపడానికి మరియు పాలస్తీనా ప్రజల బాధలను అంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఒమన్ స్వాగతించింది. గాజా నుండి ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి మార్గం సుగమం చేసేలా, గాజా పునర్నిర్మాణానికి పరిస్థితులను సృష్టించే  ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే ఈ ప్రతిపాదనకు హమాస్ ప్రతిస్పందనను కూడా ఒమన్ స్వాగతించింది.
గాజాలో శాంతియుత మరియు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి అన్ని దేశాలు చేసే ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రయత్నాలు పాలస్తీనియన్లకు అత్యవసరంగా మానవతా సహాయం అందించడంలో, పాలస్తీనా ఏర్పాటు శాంతిని స్థాపించడంలో ఫలితమిస్తాయని ఒమన్ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాలు మరియు అంతర్జాతీయ చట్ట సూత్రాలకు అనుగుణంగా, 1967లో నిర్ణయించిన సరిహద్దుల్లో తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకునేలా అన్ని దేశాలు కలిసి రావాలని ఒమన్ పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com