కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- October 05, 2025
కువైట్: కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై అమల్లో ఉన్న నిషేధాన్ని కువైట్ ఎత్తివేసింది. స్థానికంగా ముల్లెట్ ఫిష్ ల సరఫరాను పెంచడం మరియు వాటి ధరలను తగ్గించడం లక్ష్యంగా కువైట్ బే లోపల ముల్లెట్ చేపలు పట్టడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ (PAAAFR) అనుమతిని మంజూరు చేసింది. ఇప్పుడు మత్స్యకారులు అక్టోబర్ నుండి నవంబర్ చివరి వరకు కాలానుగుణ నిషేధం అమలులోకి వచ్చే వరకు బేలో ముల్లెట్ లను పట్టుకోవచ్చని అధికారులు తెలిపారు.
కువైట్ బే లోపల చేపలు పట్టడంపై గత 20 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కువైట్ జాలర్ల సంఘం పదేపదే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, బేలో ఏడాది పొడవునా చేపలు పట్టడానికి అనుమతిస్తే ముల్లెట్ ధరలు మరింత తగ్గుతాయని యూనియన్ చైర్మన్ అబ్దుల్లా అల్-సర్హీద్ తెలిపారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు కువైట్ ఆర్థిక జలాల్లో తీరం నుండి 12 మైళ్ల దూరంలో ఉన్న ముల్లెట్‌ను మాత్రమే మత్స్యకారులు పట్టుకోవడానికి అనుమతి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







