ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!
- October 05, 2025
మస్కట్: ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ ప్రారంభమైంది. వ్యవసాయ శాలక ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ పనిచేయనుంది. ఆహార భద్రతా వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలను సాధించడానికి ఇది దోహదపడనుంది. ఆహార భద్రతా రంగంలో పెట్టుబడులను పెంచడం, ఆహార భద్రతా రంగానికి డిజిటల్ సేవల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సమగ్ర ఆహార వ్యవస్థను సాధించడం ఈ ల్యాబ్ లక్ష్యంగా నిర్దేశించారు.
ఈ సంవత్సరం ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కృషి చేస్తుందన్నారు. కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు వచ్చేలా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎంపిక చేసిన నిపుణులు, ఇన్వెస్టర్లు, అధికార ప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రత్యేక వర్క్‌షాప్ లు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి.
ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ 2024 లో వివిధ రంగాలలో 41 పెట్టుబడి ప్రాజెక్టులను సాధించింది. వీటి మొత్తం విలువ OMR45 మిలియన్లకు మించి ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్య రంగంలో OMR36.8 మిలియన్లకు పైగా విలువ కలిగిన పద్నాలుగు పెట్టుబడి ఒప్పందాలు, OMR32.3 మిలియన్లకు పైగా విలువ కలిగిన వ్యవసాయ ప్రాజెక్టులకు 177 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఈ రంగంలో పెట్టుబడి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి "తరావత్" మరియు "జాద్" ప్లాట్‌ఫారమ్‌లను కూడా ప్రారంభించారు. యు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 66 అదనపు పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







