కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- October 05, 2025
కువైట్: కువైట్ లో పబ్లిక్ హైజిన్ పట్ల అవగాహన ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ప్రజా పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపై భారీగా జరిమానాలు విధించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ అధికారిక ప్రతినిధి మొహమ్మద్ అల్-సిందాన్ తెలిపారు. బాధ్యతారహిత ప్రవర్తనల వల్ల పారిశుధ్య కార్మికులపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ట్రాఫిక్, విద్యుత్, నీరు మరియు పర్యావరణ చట్టాల కింద నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తామని తెలిపారు.
స్ట్రీట్స్, బీచ్ లు, పబ్లిక్ మార్కెట్ లు ఇతర పబ్లిక్ ప్లేస్ లలో వ్యర్థాలను వేయవద్దని అధికారులు కోరారు. కువైట్ వ్యాప్తంగా పబ్లిక్ ఏరియాల్లో పరిశుభ్రతపై కఠినంగా ఉండనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు, కఠిన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా కువైట్ ఇమేజ్ను పెంచుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







