కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- October 06, 2025
కువైట్: జనవరి మరియు సెప్టెంబర్ మధ్య వివిధ దేశాలకు చెందిన 28,984 మందికి పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. ఇందులో ఎక్కువ మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపింది. బహిష్కరించిన వారికి స్పాన్సర్ విమాన టికెట్ అందించకపోతే, డిపోర్టేషన్ శాఖతో కలిసి పనిచేసే ఆమోదం పొందిన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ టిక్కెట్ ఖర్చులను చెల్లిస్తుందన్నారు. ఆ తర్వాత మంత్రిత్వ శాఖ స్పాన్సర్ నుండి ఖర్చును తిరిగి పొందుతుందని, చెల్లింపు ప్రక్రియ ముగిసే వరకు వారి ప్రయాణంపై నిషేధాన్ని విధిస్తామని తెలిపింది.
వ్యక్తికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా అత్యవసర ప్రయాణ పత్రం ఉంటే బహిష్కరణ ప్రక్రియ సాధారణంగా మూడు రోజులు పడుతుందన్నారు. అయితే, కొన్ని కేసులకు రాయబార కార్యాలయ ప్రక్రియల్లో జాప్యం లేదా కోర్టు హాజరు వంటి కారణాలతో ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించింది. ఇక ప్రయాణ పత్రాలు లేని వారికి, బహిష్కరణ పూర్తి చేయడానికి వీలుగా అత్యవసర పాస్‌పోర్ట్‌లను జారీ చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సమన్వయంతో పనిచేస్తుందన్నారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!







