మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!

- October 06, 2025 , by Maagulf
మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!

మనామా: ముంటాజా మార్కెట్ తన అన్ని శాఖలు పూర్తిగా పనిచేస్తున్నాయని, బహ్రెయిన్ అంతటా వినియోగదారులకు అంతరాయం లేకుండా సేవలను కొనసాగిస్తున్నాయని ధృవీకరించింది. మార్కెట్ పై ప్రభావితం చేసే ప్రస్తుత సవాళ్లను కంపెనీ గుర్తించిందని, ఇవి కొన్ని ఉత్పత్తుల లభ్యతను ప్రభావితం చేశాయని పేర్కొంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలు తీవ్రంగా పనిచేస్తున్నాయని, బ్యాంకులు మరియు సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఇటీవలి సోషల్ మీడియా పుకార్లపై స్పందించింది. ముంటాజా మార్కెట్ శాఖల మూసివేత అనేది పూర్తి కట్టుకథలని కొట్టిపారేసింది. అవి పూర్తిగా అబద్ధమని తెలిపింది. బహ్రెయిన్ సమాజానికి 42 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. తమకు అండగా ఉన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com