యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!

- October 06, 2025 , by Maagulf
యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!

మనామా: బహ్రెయిన్ లో తన పదవీకాలం పూర్తయిన సందర్భంగా అల్ సఖిర్ ప్యాలెస్‌లో యుఎస్ నావల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ వైస్ అడ్మిరల్ జార్జ్ వికాఫ్, బహ్రెయిన్ కింగ్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకార పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించడంలో యుఎస్ కీలక పాత్రను కింగ్ హమద్ ప్రశంసించారు. బహ్రెయిన్-యుఎస్ రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంలో వైస్ అడ్మిరల్ జార్జ్ వికాఫ్ చేసిన కృషికి గుర్తింపుగా, ఆయనకు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ అవార్డును ప్రదానం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com