యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- October 06, 2025
యూఏఈ: 2025 చివరిలో యూఏఈ నివాసితులు ఈద్ అల్ ఎతిహాద్‌ను జరుపుకోనున్నారు. పబ్లిక్ హాలిడే సమయంలో రెండు వీకేండ్లను చేర్చడం ద్వారా నివాసితులు 9 రోజులపాటు సెలవులను పొందవచ్చని అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్‌లో ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సెలవుల కారణంగా విమాన ఛార్జీలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలిపారు.
డిసెంబర్ సెలవుల సీజన్‌లో ప్రయాణించే వారు ఇప్పుడే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. సీజన్ లో విమాన ఛార్జీలు 50 శాతం వరకు పెరగవచ్చని తెలిపారు. ఇప్పుడు బుక్ చేసుకునే ప్రయాణికులు నవంబర్ చివరి వరకు వేచి ఉండే వారితో పోలిస్తే 30 శాతం నుండి 40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని ముసాఫిర్.కామ్ సీఓఓ రహీష్ బాబు సూచించారు. ప్రస్తుతం, దుబాయ్ నుండి వచ్చే రౌండ్-ట్రిప్ ఛార్జీలు కీలకమైన అంతర్జాతీయ మార్గాల్లో పోటీ ధరలను చూపిస్తున్నాయని తెలిపారు.
సాధారణంగా అంతర్జాతీయ ప్రయాణాలకు 6 నుండి 8 వారాల ముందుగానే బుకింగ్ విండో ఉంటుందని క్లియర్‌ట్రిప్ అరేబియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ బాగుల్ తెలిపారు. డిమాండ్ పెరిగే కొద్ది ఛార్జీలు పెరుగుతాయని అన్నారు. కాగా, డిసెంబర్ నెలకు సంబంధించి ప్రయాణ హడావుడి ప్రారంభమైందని తెలిపాడు. ఇప్పటికే కొన్ని రూట్లలో విమాన ఛార్జీలను పెంచి చూపిస్తున్నారని పేర్కొన్నాడు. కాబట్టి, రాబోయే సెలవును ఆస్వాదించడానికి ఇప్పుడే ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా 50శాతం వరకు ఆదా చేసుకోవచ్చని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!
- దోహాలో 22వ జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు..!!
- సౌదీలో మరో 6 డ్రైవింగ్ స్కూల్స్..!!
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్







