దమ్మామ్లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- October 06, 2025
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) అనేక ఉల్లంఘనలకు పాల్పడినందుకు దమ్మామ్లో ఉన్న ఒక వాణిజ్య సంస్థపై చర్యలు తీసుకుంది. 1 లక్ష 50 వేల కంటే ఎక్కువ గడువు ముగిసిన ఔషధ ఉత్పత్తుల ప్యాకేజీలను అధికారులు గుర్తించారు. వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు సంస్థను SFDA పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసింది.
సౌదీ ఫార్మాస్యూటికల్ మరియు హెర్బల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు ప్రిపరేషన్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం.. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా SR10 మిలియన్ల వరకు జరిమానా విధించవచ్చు. లేదా రెండు శిక్షలను ఒకేసారి అమలు చేయవచ్చు. సౌదీ మార్కెట్లలో ఫార్మా ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నట్లు డ్రగ్ అథారిటీ అధికారులు తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఏవైనా ఉల్లంఘనలను 19999 నంబర్ కు కాల్ చేసి నివేదించి సహకరించాలని డ్రగ్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







