కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- October 06, 2025
కువైట్: కువైట్ లో విద్యా సంబంధిత రంగాలపై కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి. కార్మిక మార్కెట్ను నకిలీ అర్హతల నుండి రక్షించడానికి, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ విద్యా డిగ్రీల ప్రమాణికతను పెంచేలా కొత్త ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం ఉల్లంఘించినవారికి కఠినమైన శిక్షలను అమలు చేయనున్నారు. ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 కువైట్ దినార్ల వరకు జరిమానా విధించనున్నారు. ఇక ఫేక్ డిగ్రీలను ఉపయోగించడం లేదా ఆమోదించడం వంటి వాటిల్లో పాల్గొన్నట్లు తేలిన ఉద్యోగులను విధుల జైలుశిక్ష, జరిమానాతోపాటు శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తారు.
కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చిన డిగ్రీ సంబంధిత సర్టిఫికేట్లను ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వారి దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్న సమయంలో వారు ఒక సంవత్సరం వరకు తాత్కాలికంగా పని చేసే అవకాశాన్ని కల్పించారు. విద్యా సమగ్రతను బలోపేతం చేయడానికి, అర్హతల విశ్వసనీయతను నిలబెట్టడానికి కువైట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







