ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- October 07, 2025
మస్కట్: లబ్ధిదారులతో వ్యవహరించడంలో ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమం మొదటి దశ మస్కట్లో ప్రారంభమైంది. ప్రతిపాదనలు, ఫిర్యాదులు మరియు నివేదికలను దాఖలు చేయడానికి జాతీయ సైట్ అయిన తజావోబ్ ప్లాట్ఫామ్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు.
మస్కట్ గవర్నరేట్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం; ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ అందించడం, ఫాలో-అప్ చేయడం; ప్రభుత్వ సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య నైపుణ్య మార్పిడిని పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
తజావోబ్ ప్లాట్ఫారమ్ 54 ప్రభుత్వ సంస్థలను కలిగి ఉంది. ఇప్పటివరకు 86వేల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్షాప్లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా







