బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- October 08, 2025
అమరావతి: ఏపీకి చెందిన కోనసీమ జిల్లాలోని రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మంటలలో చిక్కి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారిని అంబపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో సుమారు 40 మంది కార్మికులు కేంద్రంలో విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలి, గోడ శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనను రామచంద్రపురం ఆర్డీవో పరిశీలించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావించినట్టు, ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించమని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే అత్యుత్తమ వైద్య సాయం అందించమని సూచించారు. అదేవిధంగా, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!