అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్‌ అభివృద్ధికి ఒప్పందం..!!

- October 08, 2025 , by Maagulf
అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్‌ అభివృద్ధికి ఒప్పందం..!!

మస్కట్: సౌత్ అషర్కియా గవర్నరేట్‌లోని అల్ కమిల్ వాల్ వాఫీలోని విలాయత్‌లో అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్‌ ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఒమన్ LNG కంపెనీ మరియు ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO) లతో ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ఒప్పందం చేసుకుంది. దీని మొత్తం వ్యయం OMR2.6 మిలియన్లు. ఈ ఒప్పందంపై ఎన్విరాన్‌మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అలీ అల్ అమ్రి,  ఒమన్ LNG డెవలప్‌మెంట్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అమెర్ నాసర్ అల్ ముతాని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ అషర్కియా గవర్నర్ డాక్టర్ యాహ్యా బదర్ అల్ మావాలి పాల్గొన్నారు.

అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్‌ను పర్యావరణ పర్యాటక గమ్యస్థానంగా మార్చడం ఈ ఒప్పందం లక్ష్యమని సౌత్ అషర్కియా పర్యావరణ విభాగం డైరెక్టర్ నాజర్ సలీమ్ అల్ అరైమి తెలిపారు. ఇది సహజ వారసత్వాన్ని కాపాడుకోవడం, స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని సాధించడం మధ్య సమతుల్యతను కలిగి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్ సహజ ఆవాసాల పరిరక్షణ, వన్యప్రాణులు మరియు వృక్షసంపద, ముఖ్యంగా అంతరించిపోతున్న జాతుల రక్షణతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఇది గవర్నరేట్‌లో పర్యాటక రంగాన్ని మరింత డెవలప్ చేస్తుందని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com