ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..

- October 09, 2025 , by Maagulf
ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ టాప్ ప్లేస్ లో నిలిచారు.

ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర ఆదాయం సుమారు 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం 12శాతం 14శాతం ఆదాయం క్షీణించింది. ఇదిలాఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలి కమ్యూనికేషన్ సంస్థ జియో పబ్లిక్ ఇష్యూకు రానుంది. 2026 తొలి అర్ధభాగంలో తాము ఐపీవోకు వస్తున్నట్లు రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సమావేశంలో వెల్లడించారు. మరోవైపు.. కృత్రిమమేధను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ ఏర్పాటు గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

భారతదేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల పోర్బ్స్ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ నాల్గో స్థానంలో నిలవగా.. అతని సంపద 34.2 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం అత్యధికంగా డాలర్లు సంపాదించిన వ్యక్తిగా సునీల్ మిట్టల్ నిలిచారు. ఇక టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 33.2బిలియన్ డాలర్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com