భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- October 09, 2025
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. అయితే కీర్ స్టార్మర్ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా యశ్రాజ్ ఫిల్మ్స్తో సహా భారతీయ నిర్మాణ సంస్థలు యూకేలోని అన్ని ప్రదేశాలలో సినిమాల్ని చిత్రీకరిస్తాయని వెల్లడించారు. భారత్కు స్టార్మర్ రాక వల్ల సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు రానున్నాయి.
కీర్ స్టార్మర్ పర్యటన సందర్భంగా యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ 2026 నుంచి తమ మూడు పెద్ద సినిమాలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాల నిర్మాణం ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల కొద్దీ పౌండ్ల పెట్టుబడి లభిస్తుంది. అలాగే యూకేలో 3,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు పెరుగుతాయి. దీంతో సినీ రంగానికి అభివృద్ధి జరుగుతుంది.
ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే విస్కీ, కార్లు, వైద్య పరికరాలు వంటి ఉత్పత్తులపై భారతదేశం విధించే పన్నులు తగ్గుతాయి. దీని వలన బ్రిటిష్ కంపెనీలకు భారత మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సుమారు రూ.4.5 లక్షల కోట్ల (44.1 బిలియన్ యూరోలు) వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ ఒప్పందం ఒక ‘లాంచ్ప్యాడ్’గా ఉపయోగపడుతుంది.
స్టార్మర్ తన వెంట 125 మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో కూడిన భారీ బృందాన్ని తీసుకువచ్చారు. వీరు భారతదేశంలో కొత్త పెట్టుబడులు పెట్టే మార్గాలను చూస్తారు. పెట్టుబడులు ఎక్కువగా రావడంతో పాటు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఈ పర్యటన వల్ల వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







