GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- October 09, 2025
దోహా: ఖతార్ లో జరిగిన GCC కమ్యూనికేషన్స్ మరియు e-గవర్నమెంట్ మినిస్టర్స్ సమావేశాల సందర్భంగా GCC e-గవర్నమెంట్ అవార్డులను అందజేశారు. ఇందులో ఖతార్ మూడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ప్రభుత్వ సామర్థ్యాల విభాగంలో ఖతార్ డిజిటల్ అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఖతార్ సామాజిక అభివృద్ధి మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ తన ప్రాజెక్ట్ 'సోకూన్' అప్లికేషన్, ఉత్తమ డిజిటల్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్ అవార్డు విభాగంలో అత్యుత్తమ ప్రాజెక్ట్ అవార్డును అందుకుంది. నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ తన ప్రాజెక్ట్ ‘ఖతార్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్’.. ఓపెన్ డేటా ఇనిషియేటివ్ విభాగంలో మొదటి స్థానాన్ని సంపాదించింది.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతికతలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ రంగాలలో వాటిని సురక్షితమైన విధానంలో వినియించేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఓపెన్ డేటా మరియు ప్రభుత్వ ఆవిష్కరణలలో ఉమ్మడి జిసిసి చొరవల ప్రాముఖ్యతను వక్తలు వివరించారు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







