దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- October 09, 2025
యూఏఈ: దుబాయ్-ఢిల్లీ మధ్య ప్రయాణించిన ప్రయాణికులకు స్పైస్‌జెట్ సంస్థ షాకిచ్చింది. బుధవారం సాయంత్రం దుబాయ్ నుండి న్యూఢిల్లీకి వెళ్లిన స్పైస్‌జెట్ ఫ్లైట్ ప్రయాణీకుల లగేజీ లేకుండానే బయలుదేరి వెళ్లింది. 148 మంది ప్రయాణికులతో కూడిన SG-12 విమానం గంట ఆలస్యంగా బయలుదేరి, భారత సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద ల్యాండ్ అయింది. అనంతరం కన్వేయర్ బెల్ట్ చుట్టూ లగేజీ కోసం ప్రయాణికులు చేరుకున్నారు. కానీ అక్కడకు ఒక్కరి లగేజీ కూడా రాలేదు. లగేజీని ఫ్లైట్ సిబ్బంది దుబాయ్ లోనే వదిలేసి వచ్చారని తెలియగానే వారంతా షాక్ కు గురయ్యారు. దీనిపై ప్రయాణికులు సోషల్ మీడియాలో స్పైస్‌జెట్ నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోశారు. గంట ఆలస్యంగా బయలుదేరినా.. లగేజీని మర్చిపోవడం తమను షాక్ కు గురిచేసిందని దీపక్ అనే మరో ప్రయాణీకుడు X లో పేర్కొన్నాడు.
కాగా, విమానయాన సిబ్బంది ప్రయాణికులను బ్యాగేజ్ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్స్ (BIRలు) నింపమని కోరినట్లు, వారి లగేసీని తదుపరి అందుబాటులో ఉన్న సర్వీస్ లో తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







