విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- October 09, 2025
దుక్మ్: ఒమన్ లోని దుక్మ్ లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించినట్లు ఒమన్‌లోని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ చైర్మన్ సిరాజుల్ హక్ వెల్లడించారు.
మృతుల్లో ఎక్కువ మంది దుక్మ్ లోని తమ పని ప్రదేశానికి వెళ్తున్న బంగ్లాదేశ్ ప్రవాసులని తెలిపారు. మృతులను అమీన్ సౌదాగర్, అర్జు, మొహమ్మద్ రోకి, మొహమ్మద్ బబ్లు, మొహమ్మద్ సహబుద్దీన్, జోవెల్ మరియు రోని గా గుర్తించారు. వారందరూ బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు.
మృతులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై ఉన్న పెద్ద ఫిషింగ్ కంటైనర్ ట్రక్కును ఢీకొట్టిందని, ఎనిమిది మంది బంగ్లాదేశ్ కార్మికులు మరణించారని, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడని ఆయన చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 3:00 గంటలకు (స్థానిక సమయం) ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. మృతదేహాలను బంగ్లాదేశ్‌కు పంపడానికి మస్కట్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిరాజుల్ హక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







