మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!

- October 09, 2025 , by Maagulf
మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!

మనామా: జర్మన్ యూనిటీ 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ పాల్గొన్నారు. బహ్రెయిన్‌లోని షెరాటన్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలుదేశాల దౌత్యవేత్తలు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

పాలస్తీనా సమస్యకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రాతిపాదనను డాక్టర్ అల్ జయానీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఇది ఈ ప్రాంతంలో న్యాయమైన, శాశ్వత మరియు సమగ్ర శాంతికి మార్గం సుగమం చేసే ఒక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

అదే సమయలో రెండు దేశాల ఏర్పాటుతోనే శాశ్వాత పరిష్కారం సాధ్యమవుతుందని మొదటినుంచి బహ్రెయిన్ బలమైన వాదనగా ఉందని మరోసారి గుర్తుచేశారు.  శాశ్వత సామరస్యానికి పునాదిగా.. పాలస్తీనా-ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్యపరమైన సహకారానికి బహ్రెయిన్ మద్దతు ఇస్తూనే ఉంటుందని తెలిపారు. మిలిలీస్టులో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలు కూడా ముందుకురావాలని, స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com