హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో మాగల్ఫ్ ముఖాముఖీ
- October 09, 2025
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఫస్ట్ టైం లవ్ స్టోరీ చేస్తున్నారు ఎలా అనిపించింది?
-చాలా హ్యాపీగా ఉంది.కేజిఎఫ్, హిట్ త్రీ యాక్షన్, చాలా బ్లడ్ బాత్ ఉన్న సినిమాలు. తెలుసు కదా ఒక లైట్ హార్టెడ్ మూవీ చాలా కొత్తగా ట్రై చేశాం.తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.
ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
-ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి వున్నప్పుడు ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అనుకుంటారు. కానీ తెలుసు కదాలో ఒక యూనిక్ పాయింట్ ని టచ్ చేశాం. అది ఇప్పుడు రివిల్ చేయకూడదు. సినిమా చూసినప్పుడు మీరు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు.
-నాకు రొమాంటిక్ స్టొరీస్ చేయడం ఇష్టం. తెలుసు కదాలో మంచి లైట్ హార్ట్టెడ్ ఎంటర్టైన్మెంట్ వుంది. హిట్ 3 కి ముందే ఈ కథ విన్నాను.కథ చాలా నచ్చింది.అయితే ముందుగా హిట్3 రిలీజ్ అయ్యింది.
-తెలుసు కదాలో లవ్ ఎమోషన్ లాఫ్ సాంగ్స్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు.
నీరజతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నీరజ గారు చాలా పాషన్ తో సినిమా చేశారు.నీరజ విజన్ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నీరజ చాలా సాఫ్ట్, సపోర్టివ్.
తెలుసు కదా లో వున్న స్పెషాలిటీ ఏమిటి?
-ఇది మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ఇందులో చాలా కొత్త పాయింట్ వుంది. ఇందులో మూడు క్యారెక్టర్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.థియేటర్స్ లో చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. సిద్దు గారి క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.
పర్శనల్ గా రాగ పాత్రతో మీకు పోలికలు ఉన్నాయా?
-కొన్ని సిమిలారిటీస్ వున్నాయి. అయితే ఇందులో కొంత గ్రే షేడ్ వుంది.పర్శనల్ గా నేను అలా ఉండలేను.
సిద్దు, రాశి గురించి?
-సిద్దుకి అన్నీ డిపార్ట్మెంట్స్ లో చాలా నాలెడ్జ్ వుంటుంది. ఒక యాక్టర్ కి అన్ని విభాగాల పై పట్టు వుండటం అదృష్టం. తన టైమింగ్ అద్భుతం,
-రాశి ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. తన డైట్, వర్క్ అవుట్ అన్నీ పద్దతిగా వుంటాయి.
తమన్ మ్యూజిక్ గురించి?
-తమన్ మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన నేను నటిస్తున్న సినిమాకి మ్యూజిక్ చేయడం ఆనందంగా వుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం చాలా అద్భుతంగా వుంటుంది.
పీపుల్ మీడియా ఫాక్టరీ సపోర్ట్ గురించి?
-పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్ లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా పాషన్ తో సినిమా చేస్తారు. ఈ సినిమాకి వారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం.
-ఈ సినిమా నుంచి పర్శనల్ గా ప్రోఫెషినల్ గా చాలా విషయాలు నేర్చుకున్నాను.
మంచి తెలుగు మాట్లాడుతున్నారు?
నాకు మొదటి నుంచి తెలుగు ఇష్టం.కాలేజ్ డేస్ లో తెలుగు ఫ్రెండ్స్ వుండేవాళ్ళు. అప్పటి నుంచి తెలుగు మాట్లాడటం అలవాటైయింది.
వెంకటేష్,త్రివిక్రమ్ సినిమాలో మీరు వున్నారని విన్నాం?
-నిజంగా నాకు తెలీదు. ఆ సినిమా అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది నిర్మాతలే చెబుతారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!