ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..

- October 09, 2025 , by Maagulf
ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పోలీసు నియామకాల నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేసే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, స్పెషల్ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఏపీఎస్‌సీ, సీపీఎల్‌, పీటీఓ, కమ్యూనికేషన్స్‌ వంటి విభాగాల్లో వేలాది ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

అయితే పోలీసు విభాగంలో ఖాళీల వివరాలకు సంబంధించిన లేఖను ఇప్పటికే డీజీపీ.. ప్రభుత్వానికి పంపించారు. ఆ వివరాలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ కార్యాలయం పంపించిన లేఖలో ఖాళీల వివరాలను ప్రస్తావించింది.

ఈ ఏడాదిృ ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న ఖాళీలని అందులో వెల్లడించారు. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగంలో.. సివిల్ పోలీస్ ఫోర్స్‌లో 315 ఎస్సైలు, 3580 సివిల్‌ కానిస్టేబుల్‌, 96 ఆర్‌ఎస్‌ఐ, 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.

ఈ పోస్టుల నియామకాలకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ కు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయని ప్రభుత్వానికి రాసిన లేఖలో డీజీపీ పేర్కొ్న్నారు. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో నేరాలు పాల్పడుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేయాలంటే.. పోలీస్ ఫోర్స్ అవసరమని అన్నారు. అందుకోసం ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com