గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- October 10, 2025
మనామాః గాజాలో సంఘర్షణను ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక మొదటి దశను అమలు చేయడానికి ఒప్పందం కుదరడంపై బహ్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ మరియు హమాస్లను చర్చలకు ఒప్పించడంలో అధ్యక్షుడు ట్రంప్ మరియు అంతర్జాతీయ మధ్యవర్తుల ప్రయత్నాలను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభినందించింది. తమ నిబద్ధతలను నిలబెట్టుకోవాలని, ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని పార్టీలకు పిలుపునిచ్చింది. గాజా నివాసితుల మానవతా పరిస్థితులు మరియు జీవన నాణ్యతను మెరుగుపరడానికి ప్రపంచ దేశాలు సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







