జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- October 10, 2025
కువైట్ః కువైట్ లోని అన్ని గవర్నరేట్‌లలో పబ్లిక్ హైజిన్ మరియు రహదారి ఆక్రమణ నిబంధనల ఉల్లంఘనలను ఎదుర్కొవడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు కువైట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఫర్వానియా గవర్నరేట్‌లో జలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో 10 కార్లను తొలగించారు. ఈ ఆపరేషన్‌లో 150 మంది కార్మికులు పాల్గొన్నారని తెలిపారు.
క్యాపిటల్ గవర్నరేట్‌లో పబ్లిక్ క్లీన్లీనెస్ మరియు రోడ్ ఆక్యుపేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఫైసల్ అల్-ఒతైబి తనిఖీలను పర్యవేక్షించారు. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీల సందర్భంగా 32 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన 43 మందికి నోటీసులు జారీ చేశారు. కాగా, అన్ని ప్రాంతాలలో ఫీల్డ్ తనిఖీలు కొనసాగుతాయని అల్-ఒతైబి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







