తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు
- October 10, 2025
హైదరాబాద్: ఇసుకతో పాటు,ఇతర మినరల్స్ తవ్వకాలను చేపట్టేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఒక్క ఇసుక విక్రయాలు మాత్రమే నిర్వహిస్తుండా, మిగిలిన ఖనిజాలను టెండర్ల పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపులు చేస్తోంది. అయితే అనుమతి పొంది సంబంధిత ఖనిజ తవ్వకాలను చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నట్లు సంస్థ గుర్తించింది. దీంతో ఇసుకతో పాటు, ఇతర ఖనిజాలను కూడా సంస్థ ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఖనిజ అభివృద్ధి సంస్థ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో ఇసుకుతో పాటు, డోలమైట్, గ్రానైట్, సున్నపురాయి, మార్బుల్, మైకా తదితర ఖనిజాల నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చినట్లయితే వీటన్నింటినీ ఇక నుండి సొంతంగానే తవ్వకాలు జరిపాలని అధికారులు నిర్ణయించారు. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా గ్రానైట్, సున్నపు రాయి నిల్వలు ఉన్నట్లు బయటపడింది.
ఈ మేరకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో గ్రానైట్, సున్నపు రాయి. నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రధానంగా కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ నిల్వలు భారీగా ఉన్నట్లు తేల్చింది. కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, ఖమ్మం జిల్లాలో కొత్తగట్టు, నమిలికొండ, వెంతడుప, తాళ్లపూసపల్లె తదితర ప్రాంతాల్లో 83.25 హెక్టార్ల విస్తీర్ణంలో 28,400 క్యూబిక్ మీటర్లలో తెలుపు, బ్రౌన్, నలుపు రకాలకు చెందిన గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా నల్లగొండ, సూర్యాబాద్, వికారాబాద్ జిల్లాల్లో సున్నపు రాయి నిక్షేపాలు ఉన్నట్లు కనుగొంది. ఆయా జిల్లాల్లోని సూర్యాపేట్ జిల్లాలోని మేళ్లచెర్వు, మఠంపల్లి, రఘునాధపాలెం, రామాపురం, దొండపాడు, నల్లగొండ జిల్లా తామరచెర్ల, వికారాబాద్ జిల్లా మల్కాపూర్, జివంగి ప్రాంతాల్లో 276.83 కిలోమీటర్ల విస్తీర్ణంలో సున్నపు రాయి నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు వీటికి సంబంధించిన తాజాగా నివేదికను ఖనిజాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. ఇదే సమయంలో ఈ నిక్షేపాలను తవ్వేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







