MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- October 10, 2025
మస్కట్: ఖతార్ ఆర్థిక వృద్ధికి, జాతీయ ఆదాయ వనరుల వైవిధ్యానికి లాజిస్టిక్స్ రంగం కీలక పాత్రను పోషిస్తుంది. దీనిని బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా 2026 సంవత్సరానికి లాజిస్టిక్స్ రంగంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు మూడవ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు ఒమన్ లాజిస్టిక్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ఒమన్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఆధునిక ఉత్తమ పద్ధతులను స్వీకరించడం ద్వారా ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా ఒమన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంచడం ఈ అవార్డు లక్ష్యమని పేర్కొంది. గత పన్నెండు నెలలుగా నిర్వహించిన అన్ని లాజిస్టిక్స్ కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతులు మరియు వినూత్న ప్రాజెక్టులను గుర్తించి అవార్డును అందజేస్తారు.
ఈ అవార్డును గోడౌన్లు, షిప్పింగ్ లైన్, నౌక ఏజెంట్లు, రవాణా, కస్టమ్స్ క్లియరెన్స్, పోర్టులు మరియు ఫ్రీ జోన్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, సరుకు రవాణా ఫార్వార్డింగ్ వంటి వివిధ లాజిస్టిక్స్ కార్యకలాపాలను కవర్ చేస్తుందని తెలిపారు.
ఈ అవార్డులో ఐదు ప్రధానంగా ఒమనైజేషన్, హెల్త్ అండ్ సేఫ్టీ, నెట్ జీరో ఉద్గారాలు, నిరంతర అభివృద్ధి మరియు ఆవిష్కరణలు, ఒమానీ ఉత్పత్తులు మరియు సేవలు అనే విభాగాలలో అందించిన సేవలకు గాను ఎంపిక చేసి అందజేస్తారు. కంపెనీలు మరియు సంస్థలు అధికారిక వెబ్‌సైట్ (http://www.logistics-bpa.com) ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని లాజిస్టిక్స్ అసోసియేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్లో మెటా అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్గా రుషికొండ ప్యాలెస్?