వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- October 11, 2025
రియాద్: రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్‌కు వెస్ట్ లో ఉన్న వాడి హనీఫా సమీపంలోని 33.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వాటి యజమానులు వాడి హనీఫా మరియు దాని ఉపనదులకు సంబంధించిన పట్టణ కోడ్ ప్రకారం ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు, భవన నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపింది.
ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతు ఇస్తుందని మార్కెట్ నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. రియాద్ పట్టణ ప్రణాళిక నిబంధనలు నిర్మాణ రంగంతోపాటు చుట్టుపక్కల పట్టణ వాతావరణాన్ని మెరుగుపరచడం, జీవన నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయని కమిషన్ వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..