అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- October 11, 2025
వాషింగ్టన్: ఖతార్ డిప్యూటీ పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థానీ అమెరికాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్లో అమెరికా వార్ సెక్రెటరీ పీట్ హెగ్సేత్తో సమావేశమయ్యారు.
సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సహకారంతోపాటు పలు అంశాలపై వారు చర్చించారు. తాజాగా మిడిలీస్టుతోపాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం రక్షణ రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో అమెరికాలో ఖతార్ రాయబారి షేక్ మెషల్ బిన్ హమద్ అల్-థానీ కూడా పాల్గొన్నారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తోపాటు ఇరు దేశాలకు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..