హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తో మాగల్ఫ్ ముఖాముఖీ
- October 12, 2025
రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. తొలి వారంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది.కాంతార: చాప్టర్ 1 విజువల్ వండర్ గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. ప్రేక్షకులు విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతరకి ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార: చాప్టర్ 1 ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
కాంతార: చాప్టర్ 1తో చాలా పెద్ద విజయాన్ని అందుకున్నారు.. కంగ్రాజులేషన్స్.
-థాంక్యూ అండి. తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాంతారకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఈ సినిమా కూడా అంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. నా జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను .
ప్రీక్వెల్ ఆలోచన ముందు నుంచే ఉందా?
కాంతార చేసినప్పుడే ఈ ఆలోచన కూడా ఉంది. కాంతారాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి ప్రీక్వెల్ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం.
కాంతారతో జానపద కథలకు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చారని ప్రశంసలు రావడం ఎలా అనిపించింది?
- చాలా ఆనందంగా వుంది.కథని చాలా నిజాయితీగా చెప్పాలనుకున్నాం. అది ప్రేక్షకులకు నచ్చింది. ఇండియా జానపద కథలకు నిలయం. ఈ సినిమా విజయం మరిన్ని జానపద కథలు రావడానికి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది.
- నాకు జానపద కథలు చేయడం ఇష్టం.కాంతార మా ప్రాంతంలో జరిగిన కథ. అందుకే లొకేషన్ కూడా మా ప్రాంతంలోనే తీసుకోవడం జరిగింది.
-కాంతార చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. ఈ సినిమా చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ తో కూడుకున్నది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక ఛాలెంజ్ గా ఉండేది.
-కాంతార లాంటి సినిమాకి వరల్డ్ బిల్డింగ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. కాంతార కోసం మా ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన స్టూడియో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.చిన్నప్పుడు నుంచి మా ఊర్లో షూటింగ్ చేయాలని కోరిక ఉండేది. మా ఊరు ప్రాంతం వాళ్లు కూడా ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.
-నా వైఫ్ ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు మర్చిపోలేను. కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కాంట్రిబ్యూషన్ మాకు ఎంతగానో హెల్ప్ అయింది.
రుక్మిణి వసంత్ పాత్ర గురించి?
రుక్మిణి ప్రీవియస్ సినిమాలు చూసి సెలెక్ట్ చేశాను.అలాగే గుల్షన్ దేవయ్య ,జయరాం పాత్రలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
నటుడు, దర్శుడిగా మీలో ఏ కోణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
-నా ఫస్ట్ ప్రిఫరెన్స్ డైరెక్షను. నటుడుగా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే దర్శకత్వానికి ఇస్తాను.
అజినిష్ మ్యూజిక్ గురించి?
-అజినిష్ సినిమాకి చాలా డిఫరెంట్ గా కంపొజిషన్ చేశారు. ట్రైబల్ ఏరియాస్ కి వెళ్లి అక్కడ ఒరిజినల్ స్కోర్ ని రికార్డ్ చేశారు.ఆయన కాంట్రిబ్యూషన్ మర్చిపోలేనిది.
ఎన్టీఆర్ తో మీ అనుబంధం గురించి?
-ఎన్టీఆర్ నాకు సోదరుడు లాంటివారు.ఆయన చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్టుకి జీవితాంతం రుణపడి ఉంటాను.
హోంబలే ఫిల్మ్స్ గురించి
- హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు. కేవలం నిర్మాతలుగా కాదు పర్సనల్ గా మోరల్ గా కూడా సపోర్ట్ ఇచ్చారు. వారి సపోర్ట్ తోనే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది.
ప్రస్తుతం చేస్తున సినిమాలు?
ప్రస్తుతం జై హనుమాన్ చేస్తున్నాను. ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి. అయితే వాటికి ఇంకా సమయం పడుతుంది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్