షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!

- October 12, 2025 , by Maagulf
షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!

షార్జా: షార్జాలో ఇటీవల ఇద్దరు పాదచారుల మరణం తర్వాత షార్జా పోలీసులు జైవాకర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిర్దేశించని ప్రాంతాల నుండి  రోడ్డును దాటడం పాదచారుల మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉందని షార్జా పోలీసుల ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బీ అన్నారు. పాదచారుల క్రాసింగ్‌లు, బ్రిడ్జి మరియు టన్నెల్స్ ను ఉపయోగించాలని సూచించారు. ఎల్లప్పుడూ ట్రాఫిక్ సిగ్నల్‌లను పాటించాలని అల్ నక్బీ కోరారు.

జైవాకర్లను ఉల్లంఘించేవారిని గుర్తించడానికి పోలీసు గస్తీ మరియు స్మార్ట్ పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేసినట్లు అల్ నక్బీ చెప్పారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, అలాంటి వారికి Dh400 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైతే జైవాకర్లకు జైలు శిక్షతో పాటు Dh10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com