యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- October 12, 2025
మస్కట్: అక్టోబర్ 12 నుండి ఒమన్ మరియు ఇతర యూరోపియనేతర దేశాల ప్రయాణికులకు సంబంధించి కొత్త ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 29 EU దేశాలలో సాంప్రదాయ పాస్‌పోర్ట్ స్టాంపులను ఇకపై ఆటోమేటెడ్ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్‌తో భర్తీ చేస్తారు.
ప్రతి ప్రయాణికుడి ఫేస్, ఫింగర్ ఫ్రింగ్స్ సహా పాస్‌పోర్ట్ వివరాలు ఇప్పుడు స్కెంజెన్ ప్రాంతం నుండి ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో డిజిటల్‌గా నమోదు అవుతాయి. అయితే, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోటోగ్రాఫ్‌ను మాత్రమే అనుమతిస్తారు.
డిజిటల్ ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ (EES) ఏదైనా 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు రెసిడెన్సీ ఉన్న అన్ని స్కెంజెన్ దేశాలకు ప్రయాణించే వారికి వర్తిస్తుంది. కాగా, EU పౌరులు, నివాసితులు మరియు దీర్ఘకాలిక వీసాలు లేదా నివాస అనుమతులు కలిగి ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు.
EES దీర్ఘకాలికంగా సరిహద్దు విధానాలను వేగవంతం చేస్తుందని, ఓవర్‌స్టేలు, గుర్తింపు ఫ్రాడ్స్, అక్రమ వలసలను గుర్తించడంలో అధికారులకు సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







