మీసాల పిల్ల పాట లిరికల్ వీడియో విడుదల
- October 14, 2025
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఒకసారి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తే అప్డేట్తో ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ఒక ప్రత్యేకమైన లిరికల్ వీడియోను విడుదల చేశారు. చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సాంగ్ రిలీజ్ గురించి తెలియజేశారు. ఈ పాట పేరు ‘మీసాల పిల్ల’, ఇప్పటికే టైటిల్ విన్న వెంటనే అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది.
ఆ పాట వివరాలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాఉ. ఈ పాటను దిగ్గజ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆలపించడం విశేషం. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మెలోడీకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
ఉదిత్ నారాయణ్‌తో పాటు శ్వేతా మోహన్ కూడా ఈ గీతాన్ని ఆలపించారు. గతంలో చిరంజీవి చిత్రాలలోని ఎన్నో సూపర్ హిట్ గీతాలకు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) తన గాత్రాన్ని అందించారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో పాట రానుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!