హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- February 08, 2026
హైదరాబాద్: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ప్రారంభించారు.
ఈ సమావేశంలో.. ఎంపికైన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతలను వివరించారు. చేపట్టిన కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్బంగా.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భవిష్యత్తులో తమ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు.
అలాగే, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కూడా వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







