ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- October 15, 2025
మస్కట్: ఒమన్ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సంవత్సరం ప్రాంతీయ ఇతివృత్తమైన "ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం" పిలుపునకు అనుగుణంగా ఒమన్ పర్యావరణ అథారిటీ నేతృత్వంలోని సమగ్ర జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఒమన్ వ్యాప్తంగా పర్యావరణ సవాళ్లపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్ పరిమితులను దశలవారీగా అమలు చేయడం, కఠినమైన పర్యావరణ చట్టాలు, అధునాతన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, పర్యావరణ హిత ఇంధన వనరులకు మారడం సహా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పర్యావరణ అథారిటీ తెలిపింది.
ఈ సమగ్ర అవగాహన ప్రచారంలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌ను పరిష్కరించే ప్రత్యేక సెమినార్లు, ప్లాస్టిక్ నీటి కంటైనర్లతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను హైలైట్ చేసే వర్క్‌షాప్‌లు ఉన్నాయని పేర్కొంది. ప్లాస్టిక్ వినియోగ తగ్గింపును లక్ష్యంగా చేసుకుని పాఠశాలు, కమ్యూనిటీలలో కార్యక్రమాలను విస్తరించనున్నట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!